CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:24 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వైఎస్సార్‌సీపీ నాయకులతో కార్పొరేటర్‌ అభ్యర్థుల మర్యాదపూర్వక భేటీ

  • కాటసాని రామభూపాల్‌రెడ్డి, కాటసాని శివ నరసింహారెడ్డికి ఘన సత్కారం

పాణ్యం, అక్టోబర్‌ 16 (చైతన్యగళం‌): పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్‌కు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులుగా ఎన్నికైన పలువురు నాయకులు, మహిళలు వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరువురు నాయకులకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ భేటీ సందర్భంగా నాయకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు.