డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారంపై కలెక్టర్‌ దృష్టి

ప్రత్యామ్నాయ స్థలాల గుర్తింపుపై కసరత్తు.. పొగ, కాలుష్య నివారణకు చర్యలు కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డులోని డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి షర్మిలతో కలిసి డంపింగ్‌ యార్డును సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించే అంశంపై అధికారులతో చర్చించారు. ప్రత్యామ్నాయ...