CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 8:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధం కావాలి

  • వెలుగోడులో నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సమావేశం

వెలుగోడు, అక్టోబర్ 15 (చైతన్యగళం‌): స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వెలుగోడు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, గ్రామస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేల్పుల జయపాల్‌తో పాటు వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.