CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:59 pm Posted by : CHAITHANYA GALAM NEWS

స్వయంకృషితోనే యువత ఉన్నత స్థానాలకు ఎదగాలి

  • ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి – ఆమనగల్లు సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేష్‌ గుప్తా

కడ్తాల్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు స్వయంకృషి, పట్టుదలతో ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్లు సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేష్‌ గుప్తా అన్నారు. కడ్తాల్‌ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్నేహ చికెన్‌ సెంటర్‌తో పాటు మక్తమాదారం గేటు వద్ద ఏర్పాటు చేసిన జనరల్‌ స్టోర్‌ను ఆయన రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గంప వెంకటేష్‌ గుప్తా మాట్లాడుతూ, నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. నిరుద్యోగ యువత స్వయంకృషి, పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలతో ప్రారంభించి భవిష్యత్తులో పెద్ద సంస్థలను స్థాపించే దిశగా యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు సేవ్య నాయక్‌, నరసింహ గౌడ్‌, ఉప సర్పంచులు శ్రీనివాస్ గౌడ్‌, పాండు నాయక్‌, ఆమనగల్లు కౌన్సిలర్‌ ఎనుముల రమేష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్‌, మాజీ ఎంపీటీసీ చంద్రమౌళి, నాయకులు జహంగీర్‌ అలీ, మాజీ వార్డు సభ్యుడు హెచ్‌.ఆర్‌. మహేష్‌, యువజన విభాగం అధ్యక్షుడు అంజి, రాములు యాదవ్‌, భీమ్లా నాయక్‌, శ్రీకాంత్‌ యాదవ్‌, జగదీష్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ రెడ్డి, కార్తీక్‌ రెడ్డి, గొర్ల వంశీ, కిరణ్‌ గౌడ్‌, శేఖర్‌ గౌడ్‌, సుదర్శన్‌ యాదవ్‌, తిరుపతిరెడ్డి, సాయిబాబా చారి, రాయకంటి, సురేష్‌, గూడూరు జంగారెడ్డి, గూడూరు శేఖర్‌ రెడ్డి, రాములు గౌడ్‌, యాదయ్య గౌడ్‌, బాల్‌రాజ్‌, చెన్నకేశవ, అండేకర్‌ రమేష్‌, బాలకృష్ణ, వెంకటేష్‌ తదితర స్థానిక నాయకులు, వ్యాపారులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.