ఉల్లంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం

చిగురుమామిడి , అక్టోబర్ 14 (నీలగిరి ఎక్స్‌ప్రెస్): చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ముగ్గు పోయడం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గుడిసెలు లేని తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా గ్రామానికి మంజూరైన ఆరు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ అలువాల శంకర్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల...