CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:24 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఉల్లంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం

చిగురుమామిడి , అక్టోబర్ 14 (నీలగిరి ఎక్స్‌ప్రెస్):

చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ముగ్గు పోయడం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గుడిసెలు లేని తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా గ్రామానికి మంజూరైన ఆరు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అలువాల శంకర్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇల్లు సమకూరడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చిట్టుమల్ల రవీందర్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, హౌసింగ్ ఏఈ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అందె సురేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ జితేందర్, వార్డు సభ్యులు సురేష్, రజిత, షరీఫ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.