బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన వొడితల ప్రణవ్‌

మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి హుజూరాబాద్‌, అక్టోబర్‌ 14 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్‌ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ తెలిపారు. ప్రకృతిలోని పూలను పూజిస్తూ, తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో బుధవారం హుజూరాబాద్‌ పట్టణంలోని బతుకమ్మ ఘాట్ల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. బతుకమ్మ...