వైభవంగా వాసవి దేవి శరన్నవరాత్రులు

ధనలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నందికొట్కూరు, అక్టోబర్‌ 15 (చైతన్యగళం‌): నందికొట్కూరులోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఐదో రోజు అమ్మవారు ధనలక్ష్మి దేవిగా, ఉత్సవమూర్తి మధుర మీనాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున 4.30 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేదబ్రాహ్మణుల ఆధ్వర్యంలో పంచామృత, పంచద్రవ్యాలతో శ్రీ సూక్త విధానంలో అమ్మవారికి అభిషేకం...