ఆర్థిక పథకాలపై అవగాహనకు ప్రత్యేక శిబిరాలు
సిద్ధిపేట, అక్టోబర్ 15 (చైతన్యగళం): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రజలకు అందించడమే లక్ష్యంగా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా ఆర్థిక సమ్మిళిత పథకాల సంపూర్ణ అమలు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆవిష్కరించారు. ఈ ప్రచారంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన, సేవా శిబిరాలను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి జన్...