ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి

పెండింగ్‌ నోటీసుల పరిష్కారాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయండి బీఎల్‌ఓ పర్యవేక్షకులకు కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశం కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా నోటీసులపై విచారణను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ బీఎల్‌ఓ పర్యవేక్షకులను ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ సమావేశ...