కరీంనగర్ నగరపాలక సంస్థలో ఈ-ఆఫీస్పై ఆన్లైన్ శిక్షణ
పరిపాలనలో పారదర్శకత, పనుల్లో వేగం పెంపునకు చర్యలు కరీంనగర్ టౌన్, అక్టోబర్ 15 (చైతన్యగళం): కరీంనగర్ నగరపాలక సంస్థలో పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించడంతో పాటు పనులను వేగవంతం చేసేందుకు ఈ-ఆఫీస్ విధానంపై బుధవారం ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంప్లిమెంటేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా శిక్షణ అందించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల...