శాకంబరీ అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు దంపతులు, రూరల్ సీఐ అంజలి మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న 25వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకంబరీ అలంకరణను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రకృతి ప్రసాదించిన పచ్చని కూరగాయలతో...