CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 3:00 pm Posted by : CHAITHANYA GALAM NEWS

భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  • వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తులో నీటి కొరతను నివారించాలి
  • బోరు బావి పునర్భరణ ఇంకుడు గుంత పనులను ప్రారంభించిన సర్పంచ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌

మానకొండూర్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడంతో పాటు వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని శ్రీనివాస్‌ నగర్‌ గ్రామ సర్పంచ్‌ ఎరుకల శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని శ్రీనివాస్‌ నగర్‌ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా బోరు బావి పునర్భరణ కోసం నిర్మిస్తున్న ఇంకుడు గుంత పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ, వర్షపు నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి వనరులను పరిరక్షిస్తూ, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.