బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

హైదరాబాద్  అక్టోబర్ 15.(చైతన్యగళం): హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అలాగే అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఈ మేరకు సచివాలయం నుంచి కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో దూరవాణి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు...