పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

హుస్నాబాద్, అక్టోబర్ 15(చైతన్యగళం): హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగల్లో ఒకటని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో...