శ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు
16న 108 చీరలతో అమ్మవారికి విశేష అలంకరణ – 108 రకాల నైవేద్యాల సమర్పణ మహబూబాబాద్(చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ బుధవారం నాలుగో రోజు అమ్మవారికి విశేష పూజలు, చండీ యాగం, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యదర్శనం కలగడం భక్తులు తమ అదృష్టంగా భావించారు. ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు...