వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

రైతులకు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచన మానకొండూరు, అక్టోబర్‌ 14 (చైతన్యగళం): రానున్న రోజుల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. బుధవారం మానకొండూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వి.వి. వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలో ఇప్పటికే వరి సాగు వంద శాతం పూర్తయిందని, భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా...