మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 14 (చైతన్యగళం): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవారు మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెడుపై మంచి విజయానికి ప్రతీక మహాచండీ దేవి...