CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 9:51 am Posted by : CHAITHANYA GALAM NEWS

భగత్‌నగర్‌లో దుర్గామాత మండపాల సందర్శన

  • అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యాదగిరి సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 14 (చైతన్యగళం):

శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌ నగరంలోని భగత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పలు దుర్గామాత మండపాలను భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర ఉప మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

భగత్‌నగర్‌లోని జెడ్పీ క్వార్టర్స్‌ పార్కు వద్ద గణేష్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం చైతన్య యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.