ఓటు చోరీ ఆరోపణలపై ప్రధాని స్పందించాలి

హుస్నాబాద్, అక్టోబర్ 13 (చైతన్యగళం): దేశంలో ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు చోరీ అంశంపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ అంశంపై వివిధ వర్గాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయని పేర్కొంటూ,...