వైద్య సేవల ధరల పట్టికను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలి
రోగులకు ఖర్చులపై ముందస్తు అవగాహన కల్పించాలి: బీజేపీ నాయకులు మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం): ఆసుపత్రులు, క్లినిక్లలో అందించే వైద్య సేవలు, వైద్య పరీక్షలు, చికిత్సలకు సంబంధించిన ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం రోగుల ప్రయోజనాలకు దోహదపడుతుందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాచ్వాల్ శ్యామసుందర్ శర్మ, బీజేపీ జిల్లా నాయకులు డాక్టర్ ధరంసోత్ సీతారాం నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి...