యాసంగిలో ఆరుతడి పంటల సాగుతో రైతులకు అధిక ఆదాయం
మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు దృష్టి సారించాలి: ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న గంగారం / మహబూబాబాద్, అక్టోబర్ 13(చైతన్యగళం): ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న సూచించారు. బోర్లు, బావుల కింద అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు ఏడాది పొడవునా...