శ్రీ ఉమా చంద్ర మౌళిశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు
భక్తిశ్రద్ధలతో చండీ యాగం, అన్నపూర్ణాదేవి అలంకరణ.. ప్రత్యేక పూజలు మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ ఉమా చంద్ర మౌళిశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారికి విశేష పూజలు, యాగాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు చండీ యాగం, మహా...