పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత

వ్యక్తి వద్ద 64.85 గ్రాముల గంజాయి స్వాధీనం పెద్దపల్లి, అక్టోబర్‌ 14 (చైతన్యగళం): పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం పోలీసులు 64.85 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి, పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని తనిఖీ చేశారు. అనంతరం ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా, అతడు భోజనపేటకు చెందిన జక్కుల అరుణ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద లభించిన...