CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 10:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత

  • వ్యక్తి వద్ద 64.85 గ్రాముల గంజాయి స్వాధీనం

పెద్దపల్లి, అక్టోబర్‌ 14 (చైతన్యగళం):

పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం పోలీసులు 64.85 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి, పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని తనిఖీ చేశారు.

అనంతరం ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా, అతడు భోజనపేటకు చెందిన జక్కుల అరుణ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద లభించిన గంజాయి బరువు 64.85 గ్రాములుగా ఉండగా, దాని విలువ సుమారు రూ.3,250 ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై పెద్దపల్లి గ్రామీణ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.