ఓటరు నమోదుకు మరో అవకాశం.. 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు

సిద్దిపేట, అక్టోబర్ 14 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 32-హుస్నాబాద్, 33-సిద్దిపేట, 41-దుబ్బాక, 42-గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులు, తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే 18 ఏళ్లు నిండిన యువత ఈ అవకాశాన్ని...