తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి

అక్టోబర్ 15న మహబూబాబాద్‌లో రిలే నిరాహార దీక్ష మహబూబాబాద్(చైతన్యగళం): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కట్లోజు పాండురంగ చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాకారుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 15న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం సోమవారం చెట్టబోయిన యాకన్న...