భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి వేడుకలు
లక్కీ డ్రాలో విజేతలకు చీరల పంపిణీ మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు చీరలను అందజేసి అభినందించారు. ప్రసాదాల లక్కీ డ్రా లో విజేతలకు గిఫ్ట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు,...