CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 12:38 pm Posted by : CHAITHANYA GALAM NEWS

భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి వేడుకలు

  • లక్కీ డ్రాలో విజేతలకు చీరల పంపిణీ

మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు చీరలను అందజేసి అభినందించారు. ప్రసాదాల లక్కీ డ్రా లో విజేతలకు గిఫ్ట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు, ఉత్సవాల్లో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

దేవాలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.