దుర్గామాత పూజల్లో పాల్గొన్న సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌

అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు వెల్దండ, అక్టోబర్‌ 13 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో కొలువుదీరిన శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దుర్గామాత హిందూ ధర్మంలో అత్యంత శక్తిమంతమైన దేవతగా, విశ్వాసాన్ని కాపాడే...