CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 10:08 pm Posted by : CHAITHANYA GALAM NEWS

దుర్గామాత పూజల్లో పాల్గొన్న సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌

  • అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

వెల్దండ, అక్టోబర్‌ 13 (చైతన్యగళం):

వెల్దండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో కొలువుదీరిన శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. దుర్గామాత హిందూ ధర్మంలో అత్యంత శక్తిమంతమైన దేవతగా, విశ్వాసాన్ని కాపాడే జగన్మాతగా భక్తుల పూజలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం యాదవ్‌, దేవేందర్‌ రెడ్డి, బాయపల్లి కొండల్‌, జిల్లా సేవాదళ్‌ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, డీజే మనీష్‌, అరుణ్‌, రాజు, ఈశ్వర్‌, మల్లేష్‌, శీను, అనిత, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.