22, 23వ వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలి
వీధిలైట్లు ఏర్పాటు చేసి, పిచ్చి మొక్కలు తొలగించాలి కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు సీపీఐ నాయకుల వినతి మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని 22, 23వ వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ వార్డు కమిటీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ.. 22, 23వ వార్డుల్లో...