శ్రీ ఉమా చంద్ర మౌళిశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి పూజలు

చండీయాగం, హోమాలు, సువాసిని పూజలో పాల్గొన్న భక్తులు మహబూబాబాద్, అక్టోబర్ 12(చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ ఉమా చంద్ర మౌళిశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీయాగం, హోమాలు, పారాయణాలు నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చండీయాగం నిర్వహించారు. అనంతరం ఉదయం 9...