దుర్గామాత మండపాలను సందర్శించిన మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారి దర్శనం.. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం కరీంనగర్‌, అక్టోబర్‌ 13 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. నగరంలోని సప్తగిరి కాలనీ, మారుతీనగర్‌, విద్యానగర్‌, పాతబజార్‌ తదితర ప్రాంతాల్లో కొలువుదీరిన దుర్గామాత మండపాలను మేయర్‌ సందర్శించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి...