నగరపాలక సంస్థ వాహనాల జీపీఎస్ వ్యవస్థ, ఇంధన సెన్సార్ల తనిఖీ
అభివృద్ధి పనుల పర్యవేక్షణకు డాష్‌బోర్డ్ వినియోగించాలి: కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజినీరింగ్ అధికారులకు, సిబ్బందికి అవగాహన కరీంనగర్, అక్టోబర్ 13 (చైతన్యగళం): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వాహనాల నిర్వహణను పర్యవేక్షించడంతో పాటు అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమీకృత నియంత్రణ కేంద్రాన్ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. కేంద్రంలోని అధికారులతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన వివిధ వాహనాల జీపీఎస్ ఆధారిత గమనింపు వ్యవస్థను క్షుణ్ణంగా తనిఖీ చేశారు....