డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి
అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా తొమ్మిది కాలనీల్లో వసతులపై క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశం కరీంనగర్, అక్టోబర్ 13 (చైతన్యగళం): జిల్లాలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల...