సమయస్ఫూర్తితో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డు

కరీంనగర్, అక్టోబర్ 13(చైతన్యగళం): వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బొమ్మిడేని కొమురయ్య (80) అనే వృద్ధుడిని కరీంనగర్ లేక్ అవుట్‌పోస్ట్‌కు చెందిన హోంగార్డు 767 వి. అంజనేయులు సమయస్ఫూర్తితో స్పందించి కాపాడారు. అనంతరం వృద్ధుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. లేక్ అవుట్‌పోస్ట్ ఆర్ఎస్ఐ బి. రమేష్ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, వృద్ధుడికి అండగా ఉండాలని, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేలా సహకరించాలని సూచించారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించి వృద్ధుడి ప్రాణాలను కాపాడిన హోంగార్డు వి. అంజనేయులును పోలీసు...