ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు
రైతులు అప్రమత్తంగా ఉండాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి - ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కరీంనగర్, అక్టోబర్ 13(చైతన్యగళం): ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను, రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావం డిసెంబర్‌లో గరిష్ఠ...