- వైభవంగా రెండో రోజు అలంకరణ పూజలు.. భక్తులకు అల్పాహార వితరణ
కరీంనగర్, అక్టోబర్ 12 (చైతన్యగళం):
కరీంనగర్ పట్టణంలోని 57వ డివిజన్‌లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు దుర్గామాత అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
గాయత్రీ దేవి విగ్రహ దాతలు చంద పద్మ, సమ్మయ్య ఆధ్వర్యంలో ఆలయ పూజారి మండలేముల అనిల్ శర్మ ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అల్పాహారం పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అమ్మవారి పూజల్లో భక్తులు పాల్గొని దర్శనం చేసుకుంటున్నారు.