శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సేవలో కౌన్సిలర్ చిదిరాల అరుణ దంపతులు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు.. అమ్మవారి ఆశీస్సులు పొందిన 19వ వార్డు కౌన్సిలర్ దంపతులు మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి చిదిరాల అరుణ–జ్ఞానేశ్వర్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా చిదిరాల అరుణ–జ్ఞానేశ్వర్ దంపతులు మాట్లాడుతూ.. శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు, ఆధ్యాత్మిక...