డంపింగ్ యార్డులో మంటలు, పొగపై కమిషనర్ పరిశీలన
అగ్నిమాపక సిబ్బందితో సమన్వయం చేసి మంటలను అదుపు చేసిన ప్రఫుల్ దేశాయ్ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం కరీంనగర్, అక్టోబర్ 13 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డులో తలెత్తిన మంటలు, పొగ సమస్యను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ చర్యలు చేపట్టారు. మంగళవారం అధికారులతో కలిసి డంపింగ్ యార్డును సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. డంపింగ్ యార్డులో అక్కడక్కడా కనిపించిన మంటలు, వెలువడుతున్న పొగను తనిఖీ చేశారు. అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అక్కడే ఉండి నగరపాలక...