హనుమకొండలో బీఆర్ఎస్ బతుకమ్మ సంబరాలు.. మహిళలతో కలిసి ఆడిపాడిన సత్యవతి రాథోడ్
మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హనుమకొండ, అక్టోబర్ 12(చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఆటపాటలతో సందడి చేస్తూ మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.....