మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

శక్తి సదన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. మహిళలకు నూతన వస్త్రాల పంపిణీ కరీంనగర్‌, అక్టోబర్‌ 13 (చైతన్యగళం): బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి యశ్వంత్‌ సింగ్‌ అన్నారు. ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహిస్తున్న శక్తి సదన్‌లో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యశ్వంత్‌ సింగ్‌ మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు...