రేకుర్తి గుట్టపై బతుకమ్మ సంబరాలు
మానకొండూర్ మేదరి సంఘం మహిళలు, కమిటీ సభ్యుల సందడి మానకొండూర్, అక్టోబర్ 13 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా రేకుర్తి గుట్టపై మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మానకొండూర్ మండల మేదరి మహేంద్ర సంఘం మహిళలు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించేలా సంబరాల్లో భాగస్వాములయ్యారు. మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన...