CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 10:19 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రేకుర్తి గుట్టపై బతుకమ్మ సంబరాలు

  • మానకొండూర్‌ మేదరి సంఘం మహిళలు, కమిటీ సభ్యుల సందడి

మానకొండూర్‌, అక్టోబర్‌ 13 (చైతన్యగళం):

కరీంనగర్‌ జిల్లా రేకుర్తి గుట్టపై మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మానకొండూర్‌ మండల మేదరి మహేంద్ర సంఘం మహిళలు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించేలా సంబరాల్లో భాగస్వాములయ్యారు.

మేదరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తమ వంతు భాగస్వామ్యాన్ని చాటారు.