బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ చిత్రా మిశ్రా నిమజ్జన ప్రాంతాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి కరీంనగర్, అక్టోబర్ 13 (చైతన్యగళం): జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలతో పాటు కరీంనగర్ నగరంలోనూ బతుకమ్మ వేడుకలు...