CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 9:05 pm Posted by : rakeshkashaveni12@gmail.com

బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 20లోగా దరఖాస్తు

హుస్నాబాద్ అక్టోబర్ 13 (చైతన్యగళం):

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి, లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అక్టోబర్ 20వ తేదీలోపు సీపీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తులో దుకాణం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. బాణాసంచా విక్రేతలు నిర్దేశిత అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించాలని, ప్రాథమిక అగ్నిమాపక పరికరాలను దుకాణాల వద్ద అందుబాటులో ఉంచాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రమాదాల నివారణకు ప్రజలు, వ్యాపారులు, వేడుకల నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఏసీపీ సదానందం కోరారు.