శ్రీకర్ సీడ్స్‌తో నష్టపోయాం.. న్యాయం చేయండి
వరి సాగుతో తీవ్ర నష్టాలు.. రావాల్సిన డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు హుస్నాబాద్, అక్టోబర్ 12 (చైతన్యగళం): శ్రీకర్ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన హామీలను నమ్మి వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమను నష్టపరిచిన సంబంధిత కంపెనీ, ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతకపేటకు చెందిన...