నవ్య కళానికేతన్‌ ఆధ్వర్యంలో ఘనంగా ‘స్వరరాగ సుధా’

పాత మధుర గీతాలతో సంగీత ప్రియులను అలరించిన గాయనీ గాయకులు మిర్యాలగూడ (చైతన్యగళం): నవ్య కళానికేతన్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనివాస కల్చరల్‌ ఏసీ మినీ స్టూడియోలో నిర్వహించిన ‘స్వరరాగ సుధా’ సంగీత కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. గాయనీ గాయకులు పాత మధుర గీతాలను ఆలపించి సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. తమ గానంతో ప్రేక్షకులను అలరించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కళాకారులను ప్రోత్సహిస్తున్న న్యాయవాదులు పేదబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, మట్టపల్లి రామచంద్రయ్య, అలుగుబెల్లి భూపతిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ బార్‌...