నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి పోలీస్‌ అధికారులకు కమిషనర్‌ గౌస్‌ ఆలం దిశానిర్దేశం కరీంనగర్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని సూచించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం సెప్టెంబర్‌ నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలోని శాంతిభద్రతలు, కేసుల...